స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మరో రీమేక్ సినిమాలో కనిపించబోతున్నారనే వార్తలొస్తున్నాయి. ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ అనే సినిమాను ప్రకటించారు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం ఆలస్యమవుతున్నది. ఇంతలో పవన్ సుజీత్ దర్శకత్వంలో ఓ చిత్రానికి అంగీకారం తెలిపారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ తాజాగా వెలువడింది. దీంతో భవదీయుడు…మరింత వెనక్కి వెళ్లనున్నట్లు తెలుస్తున్నది. ఈ సినిమా స్థానంలో తమిళ హీరో విజయ్ నటించిన ‘తెరి’ సినిమాను రీమేక్ చేయాలని పవన్ యోచిస్తున్నాడట.
ఈ సినిమా తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో డబ్బింగ్గా రిలీజైంది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అభ్యంతరాలు రావడంతో టైటిల్‌ను ‘పోలీస్’గా మార్చారు. ఇదే సినిమాను తెలుగు నేటివిటీకి, పవన్ ఇమేజ్‌కు తగినట్లుగా మార్చి తెరకెక్కించాలని భావిస్తున్నారట. పైగా గతంలో హరీష్‌తో చేసిన ‘గబ్బర్‌సింగ్’లో కూడా పవన్ పోలీస్ క్యారెక్టర్లో నటించి విజయాన్ని సాధించారు. అది బాలీవుడ్ మూవీ ‘దబాంగ్’కు తెలుగు రీమేక్. ఇవన్నీ వీరి కొత్త సినిమాకూ పోలిక కానున్నాయి. ప్రస్తుతం పవన్ తాను నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’, సుజీత్ డైరెక్షన్ చిత్రాలు కంప్లీట్ చేశాకే ఈ సినిమాను టేకప్ చేయబోతున్నారట.