Pawan – Balayya | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలలో యాక్టివ్‌గా ఉన్నారు. ఈ ఇద్దరు హీరోలు 2025లో బిగ్గెస్ట్ వార్కి తెరలేపనున్నట్టు అర్ధమవుతుంది. దసరా పండుగని టార్గెట్ చేసుకొని ఈ ఇద్దరు హీరోలు పోటీ పడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ కథనాయికగా నటిస్తుండగా, శ్రియా రెడ్డి కీలక పాత్రను పోషిస్తుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూవీ షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తుండగా, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్ పోస్టర్ ద్వారా తెలియజేశారు.
మరోవైపు అఖండ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న అఖండ 2 చిత్రంతో బాలయ్య సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న అఖండ 2 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో సంయుక్త హీరోయిన్గా నటిస్తోంది. 14 రీల్స్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంటలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా నందమూరి తేజస్విని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రీసెంట్గా చిత్ర టీజర్ విడుదల చేస్తూ మూవీని సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ రెండు సినిమాలు కూడా దసరా హలీడేస్ను క్యాష్ చేసుకోవాలని భావించి ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. దీంతో పవన్ , బాలయ్య సినిమాల మధ్య బిగ్ ఫైట్ అయితే ఉంటుంది.
ఇక ఈ రోజు బాలయ్య బర్త్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. శతాధిక చిత్రాల కథానాయకుడు, హిందూపురం శాసన సభ్యులు, నందమూరి బాలకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు. చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలు పోషించి మెప్పు పొందిన కథానాయకుడు. ప్రజాల జీవితంలో భాగంగా హిందూపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అని పవన్ తన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.