Allu Arjun-Pawan | గత కొద్ది రోజులుగా అంటీ ముట్టనట్టు ఉన్న పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ తాజాగా భేటి అయినట్టు నెట్టింట తెగ ప్రచారం నడుస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఏ ఒక్క ఫోటో గానీ, వీడియో గానీ బయటకు రావడం లేదు. ఈ రహస్య భేటీ గురించి ఎక్కడా ఎవ్వరికీ ఎటువంటి ముందస్తు సమాచారం కూడా లేదు. కుటుంబ సభ్యులు మీట్ అయితే దానిని ఇంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమోచ్చింది. ఎందుకు అంత గోప్యంగా ఉంచుతున్నారు అనే చర్చ ఇప్పుడు మొదలైంది. సింగపూర్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ పవన్ కళ్యాణ్ తనయుడిని పరామర్శించేందుకు అల్లు అర్జున్ సతీసమేతంగా ఇంటికి వెళ్లడంతో ఇరువురు అభిమానులు సోషల్ మీడియాలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే అల్లు అర్జున్ కలిసిన విషయాన్ని ఆయన పీఆర్ వర్గాలు వెల్లడించాయి కానీ అధికారికంగా ఎక్కడా కూడా ప్రకటన ఎందుకు చేయలేదు అనే చర్చ నడుస్తుంది.మార్క్ శంకర్ ని చూసేందుకు పవన్ ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్… దాదాపు గంట సమయం పవన్ కుటుంబ సభ్యులతో గడిపి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిని ఎందుకు అంత గోప్యంగా ఉంచుతున్నారని అందరు ముచ్చటించుకుంటున్నారు. కాగా, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య వైరం గురించి ఇప్పుడు కాదు అల్లు అర్జున్ ‘చెప్పను బ్రదర్’ అనే కామెంట్ చేసినప్పటి నుంచి చర్చ నడుస్తూనే ఉంది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెగా హీరోలు అందరు కూడా పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తే అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్ధికి సపోర్ట్ చేయడం జరిగింది. దీంతో మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్‌పై గుర్రుగా ఉన్నారు. మెగా హీరోలు కూడా అప్పటి నుండి బన్నీకి దూరంగానే ఉన్నట్టు ప్రచారం నడుస్తుంది. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వివాదంతో అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిన సమయంలో మెగా హీరోలు పెద్దగా స్పందించకపోవడం కూడా కోల్డ్ వార్ విషయంలో అనుమనాలు మరింత బలపడేలా చేసింది. అసలు ఈ మెగా అల్లు కోల్డ్ వార్కి ఎప్పుడు పులిస్టాప్ పడుతుందో చూడాలి.