Pathaan Movie Teaser | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉత్తరాదినే కాకుండా దక్షిణాదిన కూడా ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా షారుఖ్ నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళయింది. ఈయన సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నాలుగేళ్ల గ్యాప్‌ను పూర్తి చేసేందుకు షారుఖ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం షారుఖ్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘పఠాన్’ ఒకటి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాగా ఈ సినిమా టీజర్ తాజాగా అరుదైన రికార్డు క్రియేట్ చేసింది.
బాలీవుడ్ అత్యధిక లైక్స్ సాధించిన టీజర్‌గా పఠాన్ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా టీజర్‌కు 17లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. షారుఖ్ సినిమా వచ్చి నాలుగేళ్లయినా ఈయన క్రేజ్ మాత్రం తగ్గలేదు. దీని తర్వాత స్థానంలో ఆదిపురుష్ టీజర్ ఉంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా యష్‌రాజ్ ఫిలింస్‌లో బ్యానర్లో 50వ చిత్రం కావడం విశేషం. షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే నటించింది. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను జనవరి 25 పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.