Pathaan Movie First Single | బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌కు ఇండియా మొత్తం అభిమానులున్నాయి. ఈయన సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏదైనా వస్తుందంటే అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక నాలుగేళ్ళుగా షారుఖ్‌ను వెండితెరపై ఫుల్ లెంగ్త్ రోల్లో చూడాలని అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ‘సంజు ‘ తర్వాత దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని ‘పఠాన్’తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు షారుఖ్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది.
‘బేషరమ్ రంగ్’ అంటూ సాగే రొమాంటిక్ ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. షారుఖ్, దీపిక ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీని చూసి చాలా కాలమైంది. అయితే బేషరమ్ సాంగ్‌లో మునుపటి మ్యాజిక్ రిపీట్ చేసినట్లు పాటను చూస్తే తెలుస్తుంది. లేటెస్ట్గా రిలీజైన ఈ సాంగ్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. దీపిక తన బికినీ అందాలతో యూత్‌కు పిచ్చెక్కిస్తుంది. మరోవైపు షారుఖ్ సిక్స్ ప్యాక్ బాడీతో ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. ఈ ఏజ్‌లో కూడా అలాంటి బాడీ కోసం షారుఖ్చూపించిన డెడికేషన్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సాంగ్ మొత్తం హాట్నెస్తోనే నిండి ఉంది. బాలీవుడ్ బెస్ట్ జోడీలలో వీళ్లే బెస్ట్ అని ఈ ఒక్క పాటతో నిరూపించారు. విశాల-శేఖర్ స్వర పరిచిన ఈ పాటను శిల్పారావు, కరాలిసా మాన్టీరో ఆలపించారు.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా యష్‌రాజ్ ఫిలింస్‌లో బ్యానర్లో 50వ చిత్రం కావడం విశేషం. షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే నటించింది. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.