ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన యూత్‌ఫుల్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా ‘పతంగ్’. గౌతమ్ వాసుదేవమీనన్, ఎస్పీ చరణ్ కీలక పాత్రధారులు. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మాకా, సురేశ్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్‌బాబు సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు దేవకట్టా ట్రైలర్‌ను ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఈ సినిమాలో భాగం అవ్వడం పట్ల ప్రధానపాత్రధారులు వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్, ఆనందం వెలిబుచ్చారు. ఈ సినిమా ఆడియన్స్‌కి సరికొత్త అనుభూతినిస్తుందని సహ నిర్మాత రమ్య వేములపాటి పేర్కొన్నారు. ఇంకా వడ్లమాని శ్రీనివాస్ కూడా మాట్లాడారు.