ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంలో సాగే పేమకథాచిత్రం ‘పేషన్’. సుధీష్ వెంకట్, అంకిత సాహ, శ్రేయాసి షా ప్రధాన పాత్రధారులు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
డాక్టర్ అరుణ్‌కుమార్ మొండితోక, నరసింహ యేలె, ఉమేశ్ చిక్కు నిర్మాతలు. హైదరాబాద్‌లోని పలు కళాశాలల్లో 20రోజులపాటు తొలిషెడ్యూల్ చిత్రీకరణ జరిపారు. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఫ్యాషన్ ప్రపంచానికి సంబంధించిన అందమైన ప్రేమకథ ఇదని, ప్రేమ, ఆకర్షణలపై యువతలో ఉన్న అనేక సందేహాలకి సమాధానం ఈ సినిమా అని దర్శకుడు చెప్పాడు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ నటరాజన్.