అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘పరదా’. దర్శన రాజేంద్రన్, సంగీత కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడు. విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పి.వి, శ్రీధర్ మక్కువ నిర్మాతలు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నదని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు.
ఇందులో ‘రత్నమ్మ’గా కీలక పాత్ర పోషిస్తున్న సంగీత ఫస్ట్‌లుక్‌ని సోమవారం విడుదల చేశారు. ఓ చేత్తో అట్లకాడ, మరో చేత్తో చిల్లులగెరిట పట్టుకొని సంగీత హోమ్లీగా నవ్వుతూ ఈ లుక్‌లో కనిపిస్తున్నది. ఢిల్లీ, హిమాచలప్రదేశ్లతోపాటు కొన్ని గ్రామాల్లోని అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపామని, అనుపమ పరమేశ్వరన్ కెరీర్లో చిరస్థాయిగా నిలిచే చిత్రమిదని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: మృదుల్ సుజిత్‌సేన్, సంగీతం: గోపీసుందర్, నిర్మాణం: ఆనంద మీడియా.