Pandu Master | ప్రమాదం తర్వాత తొలిసారి మాట్లాడిన పండు మాస్టర్.. కళ్లనీళ్లు పెట్టుకుంటూ జరిగిన విషయం వెల్లడి
Pandu Master | తెలుగు బుల్లితెరపై తన ప్రత్యేకమైన డాన్స్ స్టైల్, అద్భుతమైన కొరియోగ్రఫీతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్న పండు మాస్టర్ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు.
Pandu Master | తెలుగు బుల్లితెరపై తన ప్రత్యేకమైన డాన్స్ స్టైల్, అద్భుతమైన కొరియోగ్రఫీతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్న పండు మాస్టర్ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రమాదం ఎలా జరిగిందో వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఆసుపత్రి బెడ్‌పైనే కళ్లనీళ్లు పెట్టుకుంటూ మాట్లాడిన పండు మాస్టర్ మాటలు అభిమానులను కలచివేస్తున్నాయి. ప్రమాద సమయంలో ఎదురైన భయానక పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఆయన వివరించారు.
పండు మాస్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం, తగరపువలసలో ఓ ఈవెంట్ పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణం ప్రారంభించారు. మార్గమధ్యంలో తనకు వాంతి వచ్చినట్లు అనిపించడంతో ఆనందపురం సమీపంలో రోడ్డు పక్కన వాహనాన్ని ఆపినట్లు చెప్పారు. కారు దిగిన తర్వాత కొంత దూరం వెళ్లి వాంతి చేసుకుంటున్నాను. అదే సమయంలో కోళ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ వ్యాన్ వేగంగా వచ్చి మా కారును బలంగా ఢీకొట్టింది. ఆ ఢీకొట్టిన ప్రభావంతో కారు నాపైకి దూసుకొచ్చింది అని పండు మాస్టర్ వివరించారు.ప్రమాదం తీవ్రత గురించి చెబుతూ పండు మాస్టర్ భావోద్వేగానికి గురయ్యారు. “కారు నాపైకి ఎక్కడంతో రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయ్యాయి. ఆ సమయంలో నేను స్పృహ కోల్పోయాను. తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదు. ఆసుపత్రిలోనే కళ్లు తెరిచాను” అని ఆయన తెలిపారు.
ఈ ఘటనలో ఆయనకు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. విశాఖపట్నం జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో పండు మాస్టర్ ప్రయాణిస్తున్న కారు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయిందని తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ప్రమాదంలో గాయాల తీవ్రత దృష్ట్యా కనీసం ఆరు నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో కొంతకాలం పాటు ఆయన తన వృత్తిపరమైన కార్యక్రమాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. పండు మాస్టర్ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, తోటి ఆర్టిస్టులు, బుల్లితెర ప్రేక్షకులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా డాన్స్ రియాలిటీ షోల ద్వారా పండు మాస్టర్‌కు అభిమానులుగా మారిన వారు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.
యాక్సిడెంట్ ఎలా జరిగిందో.. వివరించిన పండు మాస్టర్.. #pandumaster #latestnews #dancerpandu #volgatimes pic.twitter.com/oEkb9Oe6At
— Volga Times (@Volganews_) June 5, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

