Bhagavanth Kesari | టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి (Bhagavanth Kesari). ఎన్బీకే 108గా వస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. పెళ్లి సందD ఫేం శ్రీలీల (Sreeleela) కీలక పాత్ర పోషిస్తోంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. అనిల్ రావిపూడి టీం ఈ మూవీలో కీలక పాత్ర కోసం యూపీ భామ పల్లక్ లల్వాని (Pallak Lalwani)ని తీసుకోనుందట. ఇదే విషయమై సంప్రదించగా.. పల్లక్ లల్వాని కూడా కీ రోల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇన్సైడ్ టాక్. పల్లక్ లల్వాని జువ్వ, అబ్బాయితో అమ్మాయి చిత్రాల్లో నటించింది. మరి ఈ భామ భగవంత్ కేసరిలో ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
ఇప్పటివరకు రాయలసీయ యాసలో అభిమానులను ఎంటర్టైన్ చేసిన బాలకృష్ణ.. తాజా ప్రాజెక్ట్‌లో తెలంగాణ యాసలో వినోదాన్ని పంచబోతున్నాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలకు గూస్ బంప్స్ తెప్పించే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఎస్ థమన్ మరోసారి సంగీతం అందిస్తున్నాడు.
భగవంత్ కేసరి టీజర్..