‘పలాస 1978’ సినిమాతో హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు యువ హీరో రక్షిత్ (Rakshit Atluri). కరుణకుమార్ దర్శకత్వంలో చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడమే కాదు..విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా రక్షిత్ ప్రస్తుతం రొమాంటిక్ ఎంటర్టైనర్ శశివదనే (Sasivadane)చిత్రంలో నటిస్తున్నాడు.
కోమలీ ప్రసాద్ (Komalee Prasad ) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను ఓ వీడియో ద్వారా అందించాడు హీరో రక్షిత్ అట్లూరి. 3 రోజుల ప్యాచ్ వర్క్ మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఏపీలోని కోనసీమ, అమలాపురం లాంటి అందమైన ప్రదేశాల్లో 50 రోజులపాటు ఈ సినిమా షూటింగ్ నిర్వహించారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ తోపాటు మరిచిపోలేని జ్ఞాపకాలను అందించిన కోనసీమకు మేకర్స్ ధన్యవాదాలు తెలియజేశారు.
పచ్చని చెట్లు, పంటపొలాలను కెమెరాలో బంధించ్తి.. మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకునే సంగీతాన్ని ఆ విజువల్స్‌కు జోడించి కోనసీమ అందాలను ఆవిష్కరించిన చిన్న వీడియోను రక్షిత్ ట్వీట్ చేస్తూ..కోనసీమకు ధన్యవాదాలు. ఇక్కడ షూటింగ్ చాలా బాగా జరిగింది..అని క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఈ చిత్రంలో ప్రవీణ్ యెండమూరి, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ యాక్టర్ దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. గౌరీ నాయుడు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్, ఏజీ ఫిలిం కంపెనీతో కలిసి అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. శశివదనే విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
Thank you Konaseema❤️
It was lovely shooting there..#Sasivadane @komaleeprasad @ahiteja @agfilmcompany @Gauri_Naidu #SaikumarDara #UbbanaSaiMohan #Saravana pic.twitter.com/S1dPLxsA2q
— Rakshit Atluri (@RakshitAtluri) October 18, 2022
Read Also :Vikram 61 | విక్రమ్ 61 అప్డేట్.. రష్మిక స్థానంలో సోషల్ మీడియా సెన్సేషన్..!
Read Also : Nithiin | క్రేజీ టాక్.. నితిన్‌తో భీమ్లానాయక్ డైరెక్టర్ చర్చలు..?
Read Also : Priyamani DR56 look | ప్రియమణి DR56 ఫస్ట్ లుక్.. లాంఛ్ చేసిన విజయ్ సేతుపతి
Read Also : Ritika nayak | బార్బీ డాల్‌లా రితికా నాయక్ ట్రాన్స్ ఫార్మేషన్.. ట్రెండింగ్‌లో వీడియో