Palak Tiwari | సల్మాన్‌తో షూటింగ్.. సెట్లో అమ్మాయిలు అలాంటి దుస్తులే వేసుకోవాలి.. నటి కామెంట్స్ వైరల్
Palak Tiwari | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ (Salman Khan) గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది నటి పాలక్ తివారీ (Palak Tiwari). ‘కిసీ కా బాయ్ కిసీ కీ జాన్’లో సల్మాన్‌తో కలిసి నటించిన ఆమె చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
Palak Tiwari | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ (Salman Khan) గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది నటి పాలక్ తివారీ (Palak Tiwari). ‘కిసీ కా బాయ్ కిసీ కీ జాన్’లో సల్మాన్‌తో కలిసి నటించిన ఆమె చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. సల్మాన్‌తో కలిసి వర్క్ చేయడం సంతోషంగా ఉందని తెలిపింది. ఈ సందర్భంగా సల్మాన్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. డ్రెస్ కోడ్ (Dress Code Rule) విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని చెప్పింది.
‘సల్మాన్‌తో నటించడం చాలా సంతోషంగా ఉంది. సెట్లో అమ్మాయిల డ్రెస్ కోడ్ విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. సల్మాన్‌ఖాన్‌కు ఒక రూల్ ఉంది. సెట్లో పనిచేసే ప్రతి మహిళ.. శరీరం కనిపించకుండా పద్ధతిగా మంచి దుస్తులు ధరించాలి. డీప్ నెక్ ఉండే డ్రెస్సులు అస్సలు వేసుకోకూడదు. సల్మాన్ ఇలాంటి రూల్ పెట్టడానికి కారణం కూడా ఉంది. ఆయన సంప్రదాయాలకు ఎక్కువగా విలువిస్తారు. తన చుట్టూ ఉండే మహిళలు సేఫ్‌గా ఉండాలని కోరుకుంటారు. సెట్స్‌లో పరిచయం లేని వ్యక్తులతో పనిచేసేటప్పుడు.. అమ్మాయిలు శరీరం కనిపించేలా దుస్తులు ధరించడం వల్ల వారి భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన భావిస్తారు. అందుకే ఇలాంటి రూల్ పెట్టారు. ఈ విషయంలో మా అమ్మ చాలా హ్యాపీ. సల్మాన్ ఖాన్‌తో షూటింగ్ అంటే చాలు అమ్మకు పట్టరాని సంతోషం. ఎందుకంటే ఆమెకు నా డ్రెస్సింగ్ విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి’ అని పాలక్ తివారీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సల్మాన్ (Salman Khan), పూజా హెగ్దే (Pooja Hegde) కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan)’. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన ‘వీరమ్’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. తెలుగులో ‘వీరుడొక్కడే’ పేరుతో డబ్బింగ్ అయింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఫర్హాద్ షంజీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు దేవి ప్రసాద్, రవి బస్రూర్, హిమేశ్ రేషమ్మియా సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. వెంకటేష్, జగపతిబాబు, షెహ్నాజ్ గిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈద్ సందర్భంగా ఈనెల 21న సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.
Also Read..
Ajith Kumar | గొప్ప మనసు చాటుకున్న హీరో అజిత్.. లేడీ ఫ్యాన్ లగేజ్ మోసిన స్టార్ హీరో
Vignesh Shivan | నయన్‌తో ప్రేమ అలా మొదలైంది : విఘ్నేశ్ శివన్
Lengthening surgery | అమ్మాయిలు డేటింగ్‌కు రావట్లేదని.. రూ.కోటికి పైనే ఖర్చు చేశాడు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

