Vignesh Shivan | నయన్‌తో ప్రేమ అలా మొదలైంది : విఘ్నేశ్ శివన్
Vignesh Shivan | చిత్ర పరిశ్రమలో రొమాంటిక్ కపుల్స్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) జంట ఒకటి. సుమారు ఏడేండ్లపాటు ప్రేమించుకున్న వీరు పెద్దల అంగీకారంతో గతేడాది జూన్‌లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. నయన్‌తో తన ప్రేమకథ ఎలా మొదలైందో విఘ్నేవ్ తొలిసారి తెలిపారు.
Vignesh Shivan | చిత్ర పరిశ్రమలో రొమాంటిక్ కపుల్స్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) జంట ఒకటి. సుమారు ఏడేండ్లపాటు ప్రేమించుకున్న వీరు పెద్దల అంగీకారంతో గతేడాది జూన్‌లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెండ్లైన నాలుగు నెలలకే సరోగసి ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు కూడా. ఇదిలా ఉండగా.. నయన్‌తో తన ప్రేమకథ ఎలా మొదలైందో విఘ్నేవ్ తొలిసారి తెలిపారు. ‘నేనూ రౌడీనే’ (Naanum Rowdy Dhaan) సినిమా మొదలు కావడానికి ముందే తాను ఆమెతో ప్రేమలో పడినట్లు చెప్పారు.
‘‘పోడాపోడి’ ( Poda Podi ) పరాజయంతో కెరీర్ పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ‘నేనూ రౌడీనే’ (Naanum Rowdy Dhaan) కథ రాశాను. నా దగ్గర కథ ఉందని తెలుసుకున్న హీరో ధనుష్ తన సొంత బ్యానర్ వండర్‌బార్ ఫిల్మ్‌లో దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు. ముందుగా నయనతారను కలిసి ఈ కథ గురించి చెప్పమన్నాడు. అయితే, నయన్ ఈ కథను అంగీకరించదని ముందు నేను భావించాను. ఆ సమయంలో నజ్రియా పేరు నా మైండ్లోకి వచ్చింది. ఆమెకు కథ చెబుదామనుకున్నా. కానీ, ధనుష్ మాటను కాదనలేక నయన్‌ను కలిసి కథ చెప్పాను.
నేను చాలా మంది నటీనటులకు స్క్రిప్ట్‌లను వివరించా. అందరూ కేవలం కూర్చుని వారి ఫోన్ చూసుకునేవారు. సగం సగం కథ వింటారు. అయితే, నయన్ అలా కాదు. నేను వెళ్లి కూర్చోగానే కథ వినేందుకు ఎంత సమయం పడుతుందని నన్ను అడిగింది. ఆ సమయంలో తనను డిస్టర్బ్ చేయొద్దని తన అసిస్టెంట్‌కు చెప్పింది. ఆమె తన ఫోన్‌ను కూడా స్విచ్ ఆఫ్ చేసి.. ‘నేను కథ వినేందుకు రెడీ’ అని చెప్పింది. కథ విన్న తర్వాత ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు. వెంటనే చిత్రాన్ని అంగీకరించింది. ఆమె నన్నెంతో గౌరవించింది. ఆ క్షణమే తనతో ప్రేమలో పడిపోయా. ఇక ఆ సినిమా రెండో షెడ్యూల్ నుంచే మేమిద్దరం డేటింగ్ ప్రారంభించాం. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామన్న విషయం మేం చెప్పేవరకూ ఎవరికీ తెలీలేదు. సెట్లో నయన్‌ని మేడం అనే పిలిచేవాడిని. చివరికి ఆమె కారవ్యాన్‌లోకి కూడా వెళ్లేవాడిని కాదు. మేమిద్దరం వృత్తిపట్ల ఎంతో కమిట్మెంట్తో ఉండేవాళ్లం’ అని విఘ్నేష్ తన ప్రేమ కథను చెప్పుకొచ్చారు.
Also Read..
Jess Jonassen | ప్రేయసితో ఆసీస్ మహిళా క్రికెటర్ వివాహం.. పిక్స్ వైరల్..!
Ajith Kumar | గొప్ప మనసు చాటుకున్న హీరో అజిత్.. లేడీ ఫ్యాన్ లగేజ్ మోసిన స్టార్ హీరో
VK Sasikala | కులం చూసి ఉంటే పళనిస్వామిని సీఎం చేసేదాన్ని కాదు : శశికళ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

