Ajith Kumar | గొప్ప మనసు చాటుకున్న హీరో అజిత్.. లేడీ ఫ్యాన్ లగేజ్ మోసిన స్టార్ హీరో
Ajith Kumar | కోలీవుడ్ స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ (Ajith Kumar) మొదటి స్థానంలో ఉంటారు. ఆయన సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అజిత్ తాజాగా తన గొప్ప మనసును చాటుకున్నారు.
Ajith Kumar | కోలీవుడ్ స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ (Ajith Kumar) మొదటి స్థానంలో ఉంటారు. ఆయన సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ ఎంతో సింపుల్‌గా ఉంటారు. సామాన్య వ్యక్తిగా ప్రజల్లో కలిసిపోతుంటారు. ఫ్యాన్స్‌కు కష్టం వస్తే నేనున్నానంటూ ఎప్పుడూ ముందుంటారు. వారికి అవసరమైన సాయం చేస్తుంటారు. అలాంటి అజిత్ తాజాగా తన గొప్ప మనసును చాటుకున్నారు.
సాధారణంగా స్టార్ హీరో కనిపిస్తే అభిమానులు ఫొటోలు, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ కోసం ఎగబడుతుంటారు. స్టార్స్ కూడా వారి మూడ్, బిజీ షెడ్యూల్ కారణంగా సింపుల్‌గా ‘సారీ’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంటారు. అయితే అజిత్ మాత్రం అలా చేయలేదు. ‘ఒక్క సెల్ఫీ.. సర్’ అని అడిగిన ఓ లేడీ ఫ్యాన్‌తో అజిత్ ఫొటో దిగడమే కాకుండా.. తన మంచి మనసు చాటుకున్నాడు. పది నెలల బిడ్డ, బ్యాగ్ మోయలేక ఇబ్బంది పడుతున్న ఆ లేడీ ఫ్యాన్‌కు సహాయం అందించారు. ఆమె బ్యాగ్‌ను స్వయంగా విమానం దాకా మోసుకుంటూ వెళ్లారు. ఈ ఘటన లండన్ (London) ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని సదరు మహిళ భర్త సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
‘నా భార్య పది నెలల బాబుతో ఒంటరిగా గ్లాస్గో నుంచి చెన్నై ప్రయాణిస్తోంది. ఈ నేపథ్యంలో లండన్ విమానాశ్రయంలో ఆమె హీరో అజిత్‌ను కలిసే ఛాన్స్ వచ్చింది. ఆ సమయంలో నా భార్య బాబుతోపాటు రెండు చేతుల్లో ట్రావెల్ సూట్ కేస్, బేబి బ్యాగ్ ఉన్నాయి. నా భార్య ఇబ్బందిని గమనించిన అజిత్.. సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. నా భార్య చేతిలోని బేబీ బ్యాగును తీసుకున్నారు. వద్దన్నా వినలేదు. ‘నాకూ ఇద్దరు పిల్లలు ఉన్నారని.. ఆ ఇబ్బందులు ఏంటో నాకూ తెలుసు’ అని అజిత్ అన్నారు. బేబీ బ్యాగ్‌ను విమానం వచ్చే వరకు మోశారు. ఆ సమయంలో ఆయన చేతుల్లో ఓ సూట్ కేసు కూడా ఉంది. అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా ఆయన ఎంతో సింప్లిసిటీగా వ్యవహరించారు. ఇది నన్నెంతో ఆకట్టుకుంది. ఆయన ఎంతో గొప్ప మనిషి’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అజిత్ గొప్ప మనసును, ఆయన సింప్లిసిటీనీ మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘అజిత్ సర్.. మీరు చాలా గ్రేట్’, ‘మీరు సూపర్’ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Also Read..
VK Sasikala | కులం చూసి ఉంటే పళనిస్వామిని సీఎం చేసేదాన్ని కాదు : శశికళ
Corona India | 24 గంటల్లో 10,753 కొత్త కేసులు.. 27 మరణాలు
Satyapal Malik | పుల్వామా దుర్ఘటన కేంద్రం చేతకానితనమే.. సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

