Paarijatha Parvam | ‘కీడా కోలా’, ‘షరతులు వర్తిస్తాయి’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యువ నటుడు చైతన్య రావు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం ‘పారిజాత పర్వం’(Paarijatha Parvam). కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్.. అన్నది ఉప శీర్షిక. మాళవిక సతీశన్ కథనాయికగా నటించగా సునీల్, శ్రద్ధా దాస్ కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వేదికగా ఈ సినిమా 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై కిడ్నాప్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించగా.. వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖవాణి, సమీర్, గుండు సుదర్శన్, జబర్దస్త్ అప్పారావు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Hold on tight for a comedy thrill ride.🚗#PaarijathaParvam premieres June 12th only on @ahavideoin@IamChaitanyarao #Sunil @shraddhadas43 @harshachemudu @malavika2831 @isantydirector @reebhatter @Vanamali_C @Mahidhar2003 @deveshhh @palaparthianan2 @JungleeMusicSTH pic.twitter.com/f7FuFe2yIr
— ahavideoin (@ahavideoIN) June 7, 2024