Bachchans | బాలీవుడ్ సినిమాల కోసం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన కవితలు ఇప్పటికీ ప్రజలు తమ పెదాలపై ఉచ్చరిస్తూనే ఉన్నారు. అమితాబ్ కూడా ఈ కవితలు పదేపదే పాడుతూ తన తండ్రి పట్ల గౌరవాన్ని చాటుకుంటున్నారు. హిందీ భాషపై బిగ్ బీకి మంచి పట్టు ఉంది. ఇప్పుడు ఆయన ముద్దుల మనుమరాలు ఆరాధ్య బచ్చన్ హిందీ కవితలు ఆలాపిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. ఆమె హిందీ కవితలో కొన్ని లైన్లు ఆలాపించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది.
స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ కవిత ఆలాపించారు. అటుపై ఏ భాష నేర్చుకోవాలన్నా కవితల ద్వారా తేలిగ్గా నేర్చుకోవచ్చునంటున్నారు. ప్రస్తుతం ముంబైలోని ధీరూభాయి అంబానీ స్కూల్లో అరాధ్య బచ్చన్ చదువుతున్నారు. ఆమె ఆలాపించిన కవిత వీడియోనూ తన ఫ్యాన్ పేజీలో షేర్ చేశారు.
ఆరాధ్య వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగానే ఆమె తండ్రి అభిషేక్ బచ్చన్ కూడా రియాక్టయ్యారు. దీనిపై నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో స్పందించారు. సంప్రదాయం కొనసాగుతుందని, అభిషేక్ స్వరం బిగ్ బీ మాదిరిగానే పవర్ఫుల్ అని వ్యాఖ్యానించారు. నెటిజన్ల అభిప్రాయాలపై అభిషేక్ ప్రతిస్పందించారు. ముకుళిత హస్తాలతో కూడిన ఎమోజీ షేర్ చేశారు.