ధృవ వాయు స్వీయదర్శకత్వంలో నటించిన చిత్రం ‘కళింగ’. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ కలిసి నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా సక్సెస్మీట్ని హైదరాబాద్లో నిర్వహించారు. హీరో, దర్శకుడు ధృవ వాయు మాట్లాడుతూ ‘మౌత్ టాక్తో ఈ సినిమా అందరికీ చేరువ అవుతున్నది. ఈ సినిమలోని విజువల్స్, అమ్మవారిని చూపించిన తీరు.. ఇలా ప్రతి అంశం గురించీ ఆడియన్స్ని మాట్లాడుకుంటున్నారు. అందరూ ప్రాణంపెట్టి పనిచేశారు కాబట్టే ఈ విజయం. కంటెంట్ ఉన్న సినిమాను ఆడియన్స్ కచ్చితంగా హిట్ చేస్తారు. ఈ సినిమాతో అది రుజువైంది.’ అని చెప్పారు. దర్శకుడిపై మేం పెట్టుకున్న నమ్మకం ఈ విజయంతో నిజమైందని నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా హీరోయిన్ ప్రగ్యా నయన్, చీఫ్ మార్కెటింగ్ హెడ్ వంశీ, కెమెరామేన్ అక్షయ్ కూడా మాట్లాడారు.