OTT | ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు వచ్చినప్పటి నుండి వినోదానికి కొదువే లేదు. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధమవుతుంటే, ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ ఆస్వాదించే అవకాశాలు కలుగుతున్నాయి. మరోవైపు థియేటర్స్‌లో కూడా మంచి సందడి నెలకొని ఉంటుంది. ఈ వారం థియేటర్లో కిష్కిందపురి, మిరాయ్ సినిమాలు విడుదల అవుతున్నాయి. రెండూ రెండు విభిన్న ప్రపంచాల్లోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లి వినోదాన్ని పంచనున్నాయి.. మిరాయ్ తో చిత్రబృందం ఓ ఫాంటసీ వరల్డ్ సృష్టించింది. ఇక కిష్కిందపురి హారర్ జోనర్‌కు కాస్త ఫిక్షన్ యాడ్ చేసి తీసిన సినిమా ఇది. ఈ రెండు చిత్రాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
మరోవైపు ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న ఫేమస్ సినిమాల లిస్ట్ చూస్తే.. మంచు విష్ణు ప్రధాన పాత్రలో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన పౌరాణిక చిత్రం థియేటర్లలో కమర్షియల్‌గా ఫెయిల్ అయినప్పటికీ, ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. విష్ణు నటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా మాలిక్ జూలై 11న విడుదల కాగా, ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. రాజు జయమోహన్, ఆద్య ప్రసాద్, భవ్య నిఖిత ప్రధాన పాత్రల్లో నటించిన ఫీల్ గుడ్ డ్రామా బన్ అండ్ బటర్ జామ్ కూడా అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేస్తుంది.
రజినీకాంత్ మాస్ స్టైల్ లో వచ్చిన యాక్షన్ డ్రామా కూలీ కూడా సెప్టెంబర్ 21 నుండి అమెజాన్‌లో స్ట్రీమ్ కానుంది. టెల్లింగ్ మరియు మౌత్ టాక్ వల్ల మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సు ఫ్రమ్ సో జియో హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక సన్ నెక్ట్స్‌లో సరెండర్, ఫుటేజ్, తందాట్టి, కథికాన్ స్ట్రీమ్ కానున్నాయి. ఇక జీ5లో కమ్మాట్టమ్, అంఖోన్ కీ గుస్తాకియాన్ స్ట్రీమ్ కానుంది.జియో సినిమాలో స్పైడర్స్, ది ఆర్ట్‌ఫుల్ డాజర్ (సీజన్ 1), లిలో అండ్ స్టిచ్చీ, ఏ మినిక్రాఫ్ట్ మూవీ, హౌ టు హేవ్ సెక్స్, బ్లడీ అండ్ మిత్, ఇన్స్పెక్టర్ జిండే లు స్ట్రీమ్ కానున్నాయి. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో సూత్రవాక్యం, రవీంద్ర నీ,ఎవిడి కొతల్వాడి, జగమెరిగిన సత్యం, ప్యాడ్ గయే పంగీ, డ్యామేజ్డ్, గుడ్ వన్, ది రన్ అరౌండ్స్ స్ట్రీమ్ కానున్నాయి. ఆహాలో ఆదిత్య విక్రమ వ్యూహ చిత్రం సందడి చేయనుంది.