OTT | ప్రతి వారం కూడా మంచి వినోదాన్ని పంచే చిత్రాలు ప్రేక్షకుల మందుకు వచ్చి సందడి చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈ వారం మూవీ లవర్స్‌కు నిజంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనే చెప్పాలి. అటు థియేటర్స్, ఇటు ఓటీటీల్లో లేటెస్ట్ మూవీస్‌తో పాటు పలు వెబ్ సిరీస్‌లు కూడా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సదరు సినిమాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ వారం యాక్షన్, కామెడీ, లవ్, సోషల్ ఎలిమెంట్ అంశాలతో కూడిన మూవీస్ అలరించబోతున్నాయి. థియేటర్స్ విషయానికి వస్తే.. కోలీవుడ్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ కుబేర చిత్రం జూన్ 20న విడుదల కానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రపంచంలోనే రిచ్చెస్ట్ పర్సన్‌కు ఓ బిచ్చగాడికి మధ్య జరిగిన సంఘర్షణ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.
ఇక అనంతిక సానిల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 8 వసంతాలు కూడా జూన్ 20న విడుదల కానుంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హనురెడ్డి, కన్న పసునూరి, దుగ్గిరాల రవితేజ కీలక పాత్రలు పోషించారు. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘సితారే జమీన్ పర్ కూడా జూన్ 20న హిందీ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఓటీటీల విషయానికి వస్తే… నెట్‌ఫ్లిక్స్ లో గ్రెన్‌ఫెల్ అన్ కవర్డ్స్ (మూవీ) జూన్ 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ది గ్రేట్ ఇండియా కపిల్ షో సీజన్3 (రియాల్టీ షో) జూన్ 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జీ5 లో డిటెక్టివ్ షెర్డిల్ (వెబ్‌సిరిస్) జూన్ 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.గ్రౌండ్ జీర్ మూవీ) జూన్20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.ప్రిన్స్ ఫ్యామిలీ (మూవీ) జూన్ 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక జియో హాట్‌స్టార్ లో కేరళ క్రైమ్ ఫైల్స్2 (వెబ్‌సిరీస్: సీజన్2) జూన్ 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుండగా, సర్వైవింగ్ ఒహియో స్టేట్ (మూవీ) జూన్ 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.ఫౌండ్ (వెబ్‌సిరీస్: సీజన్2) జూన్ 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. సన్ నెక్ట్స్‌లో ఆప్ కైసే హో (మూవీ) జూన్ 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. జూన్ 17 – ఫైనల్ డెస్టినేషన్ (ఇంగ్లిష్ మూవీ – అమెజాన్ ప్రైమ్ వీడియో), ఫైట్ ఆర్ ఫ్లైట్ (ఇంగ్లిష్ మూవీ – అమెజాన్ ప్రైమ్ వీడియో, జూన్ 18 – వి వర్ లియర్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ – అమెజాన్ ప్రైమ్ వీడియో)లో స్ట్రీమ్ కానుంది.
జూన్ 17 నుండి ట్రైన్ వ్రెక్ (ఇంగ్లిష్ మూవీ – నెట్ ఫ్లిక్స్), లాటిన్ బ్లడ్ (నెట్ ఫ్లిక్స్), జూన్ 19 – కొల్ల (తెలుగు మూవీ – ఈటీవీ విన్), ది వాటర్ ఫ్రంట్ (ఇంగ్లిష్ సిరీస్ – నెట్ ఫ్లిక్స్) లో స్ట్రీమ్ కానుంది. ఇక జూన్ 18న ది బుక్కనీర్స్ సీజన్ 2 (యాపిల్ టీవీ ప్లస్), సర్వైవింగ్ ఓహియో స్టేట్ (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ – జియో హాట్‌స్టార్) లో స్ట్రీమ్ కానుంది. జూన్ 20 – ద పెట్ (తమిళ్ మూవీ – సన్ నెక్స్ట్), ఆప్ కైసే హో (సన్ నెక్స్ట్), కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 (జియో హాట్ స్టార్), ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ (మలయాళం మూవీ – జీ5), డిటెక్టివ్ షెర్డిల్ (వెబ్ సిరీస్ – జీ5), గ్రౌండ్ జీరో (జీ5), ఫౌండ్ సీజన్ 2 (జియో హాట్ స్టార్), గ్రెన్ ఫెల్ (నెట్ ఫ్లిక్స్), పాప్ డామన్ హంటర్స్ (నెట్ ఫ్లిక్స్), ఐ ఫర్ యాన్ ఐ (ప్రైమ్ వీడియో), సెమీ సోయిటర్ (నెట్ ఫ్లిక్స్), ఒలింపో (స్పానిష్ సిరీస్ – నెట్ ఫ్లిక్స్), ఏ లాగోస్ లవ్ స్టోరీ (నెట్ ఫ్లిక్స్) చిత్రాలు స్ట్రీమ్ కానున్నాయి.