OTT | జులై రెండో వారంలో పెద్ద సినిమాలేవి విడుదల కాకపోతుండడంతో చిన్న సినిమాలు క్యూట్ కట్టాయి. ముందుగా ఈ వారం అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం ఆర్కే నాయుడు ది 100. ‘మొగలిరేకులు’ ఫేం సాగర్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం జులై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ సినిమాకి పోటీగా యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఓ భామ అయ్యో రామా చిత్రం కూడా జులై 11న థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఇక గీతానంద్, మిత్రా శర్మ జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ వర్జిన్ బాయ్స్ కూడా ఈ నెల 11న సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.
పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టపడే ‘సూపర్ మ్యాన్’ మూవీ ఈ నెల 11న ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే పుల్కిత్ దర్శకత్వంలో రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలో నటించిన గ్యాంగ్ స్టర్ డ్రామా మాలిక్ చిత్రం కూడా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఓటీటీల్లోకి వచ్చే మూవీస్/వెబ్ సిరీస్‌లు విషయానికి వస్తే.. జులై 8 – మూన్ వాక్ (మలయాళం మూవీ – జియో హాట్ స్టార్), కరాటే కిడ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), ది పొనీషియన్ స్కీమ్ (ప్రైమ్ వీడియో), ది అన్ హౌలీ ట్రినిటీ (అమెజాన్ ప్రైమ్ వీడియో), వాచ్ ది స్కైస్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), భైరవం ( జీ5 తెలుగు), జులై 9 – బల్లార్డ్ (ఇంగ్లీష్ సిరీస్ – ప్రైమ్ వీడియో), రిఫార్మ్డ్ (జియో హాట్ స్టార్), అండర్ ఏ డార్క్ సన్ (వెబ్ సిరీస్ – నెట్ ఫ్లిక్స్), జియామ్ (నెట్ ఫ్లిక్స్) లో స్ట్రీమ్ కానున్నాయి.
జులై 10 – 7 బియర్స్ (యానిమేటెడ్ సిరీస్ – నెట్ ఫ్లిక్స్), బ్రిక్ (నెట్ ఫ్లిక్స్), ఏ బ్రదర్ అండ్ సెవెన్ సిబ్లింగ్స్ (నెట్ ఫ్లిక్స్), జులై 11 – నరివెట్ట (సోనీ లివ్), ఆప్ జైసా కోయి (నెట్ ఫ్లిక్స్), కలియుగం (సన్ నెక్స్ట్), మిస్టర్ అండ్ మిస్ బ్యాచిలర్ (మనోరమ మ్యాక్స్), కర్కి (సన్ నెక్స్ట్), మిస్టర్ రాణి (లయన్స్ గేట్ ప్లే), స్పెషల్ ఓపీఎస్ (జియో హాట్ స్టార్), ఏ మోస్ట్ కాప్స్ (నెట్ ఫ్లిక్స్), ఫోర్ ఇయర్స్ లేటర్ (లయన్స్ గేట్ ప్లే), మేడ్ యాజ్ డెస్టినేషన్ వెడ్డింగ్ (నెట్ ఫ్లిక్స్), ది రియల్ హౌస్ వైవ్స్ ఆఫ్ ఆరెంజ్ కంట్రీ సీజన్ 9 (జియో హాట్ స్టార్), డ్రాప్ (ప్రైమ్ వీడియో), నోబు (ప్రైమ్ వీడియో), పేవ్మెంట్స్ (MUBI), సావరిన్ (ప్రైమ్ వీడియో), జులై 13 – బ్యూరీడ్ ఇన్ ద బ్యాక్ యార్డ్ సీజన్ 6 (జియో హాట్ స్టార్) చిత్రాలు స్ట్రీమ్ కానున్నాయి.