OTT | సెప్టెంబర్ నెలలో బాక్సాఫీస్ కళకళలాడుతుంది. మొన్నటి వరకు హిట్ సినిమాలు లేక కళ తప్పిన బాక్సాఫీస్ రీసెంట్గా వచ్చిన లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమాతో మెరుపులు మెరిపించింది. మౌత్ టాక్‌తోనే ఈ సినిమాప్రేక్షకాదరణ పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. సెకండ్ వీక్ లో వచ్చిన ‘మిరాయ్’, ‘కిష్కింధపురి’ సినిమాలు రెండు మంచి విజయాలు సాధించాయి. ఇక ఈ వారం మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాయి. వాటిలో ముందుగా విజయ్ ఆంటోనీ భద్రకాళి ఒకటి. ఇది ఆయన కెరీర్ మైల్ స్టోన్ సిల్వర్ జూబ్లీ మూవీ కాగా, సెప్టెంబరు 19న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇదొక పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది.
ఇక KGF మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్న సినిమా ‘వీర చంద్రహాస’. ఇందులో శివ రాజ్‌కుమార్ అతిథిగా కనిపించగా, ఇప్పటికే కన్నడలో రిలీజైన ఈ సినిమాని ఈ నెల 19న తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇంద్రాణి దావలూరి స్వీయ దర్శక నిర్మాణంలో ‘అందెల రవమిది’ అనే సినిమా కూడా శుక్రవారమే రిలీజ్ కానుంది. ‘ది రాజా సాబ్’ డైరెక్టర్ మారుతి సమర్పణలో వస్తున్న బ్యూటీ అనే చిత్రం కూడా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ ప్రేమకథా చిత్రంలో అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక మంచు లక్ష్మి, ఆమె తండ్రి మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో రూపొందిన దక్ష కూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘అగ్నినక్షత్రం’ అనే టైటిల్ తో సినిమాని మొదలు పెట్టగా, ఇప్పుడు దానిని దక్షగా మార్చి సెప్టెంబర్ 19న థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నారు. అక్షయ్ కుమార్, అర్షద్ వార్షి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ హిందీ మూవీ ‘జాలీ ఎల్ఎల్బీ 3’ కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఇక ఓటీటీలో కూడా పలు ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి.
సెప్టెంబర్ 16 – అమెరికానా (అమెజాన్ ప్రైమ్ వీడియో), బ్యాడ్ షబ్బాస్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), జస్ట్ బ్రీత్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), ది నైఫ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), రిలే (అమెజాన్ ప్రైమ్ వీడియో), సీక్రెట్ మాల్ అపార్ట్మెంట్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), విచ్ బోర్డ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
సెప్టెంబర్ 17 – ఇలియో (జియో హాట్ స్టార్), ది మార్నింగ్ షో (సీజన్ 4 – యాపిల్ టీవీ ప్లస్), జెన్ వీ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
సెప్టెంబర్ 18 – ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (హిందీ సిరీస్ – నెట్ ఫ్లిక్స్), సిన్నర్స్ (జియో హాట్ స్టార్), బ్లాక్ రాబిట్ (ఇంగ్లీష్ సిరీస్ – నెట్ ఫ్లిక్స్), ప్లాటోనిక్ (నెట్ ఫ్లిక్స్)
సెప్టెంబర్ 19 – హోస్ మేట్స్ (జీ5), ఇంద్రా (సన్ నెక్స్ట్, Tentkotta), ష్ సీజన్ 2 (ఆహా), పోలీస్ పోలీస్ (వెబ్ సిరీస్ – జియో హాట్ స్టార్), టు మెన్ (మనోరమ మ్యాక్స్), రాండమ్ యామమ్ (మనోరమ మ్యాక్స్), ది ట్రయల్ (సీజన్ 2 – జియో హాట్ స్టార్), ది సర్ఫర్ (లయన్స్ గేట్ ప్లే), సైప్డ్ (జియో హాట్ స్టార్), బిలియనీర్స్ బంకర్ (సిరీస్ – నెట్ ఫ్లిక్స్), షీ సెడ్ మే బీ (నెట్ ఫ్లిక్స్), మై లవ్లీ లెయర్ (నెట్ ఫ్లిక్స్), హాంటెడ్ హోటల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ – నెట్ ఫ్లిక్స్), ట్రస్ట్ (ప్రైమ్ వీడియో), ఈడెన్ (అమెజాన్ ప్రైమ్ వీడియో)
సెప్టెంబర్ 20 – 28 :ఇయర్స్ లేటర్ (ప్రైమ్ వీడియో)