OTT | ప్రతి వారం థియేటర్‌తో పాటు ఓటీటీలో సినిమాల సందడి ఓ రేంజ్లో ఉంటుంది. సినీ ప్రియులని అలరించేందుకు ప్రతి వారం కూడా పవర్ ఫుల్ డ్రామాలు, థ్రిల్లింగ్ మూవీస్ విడుదల కాబోతున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం చిత్రాలు ఓటీటీ రిలీజ్ కు సిద్ధంగా ఉండటం విశేషం.. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్, జీ5 వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో పలు సినిమాలు సందడి చేయనున్నాయి. ఇక ఈ వారం థియేటర్స్‌లో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ 27న విడుదల కాబోతుంది. ఈ సినిమాకి పోటీగా మరే సినిమా రిలీజ్ కావడం లేదు. హిందీలో మా అనే చిత్రం రిలీజ్ అవుతుంది. విజయ్ ఆంటోనీ ‘మార్గన్: ది డెవిల్ చిత్రం కూడా ఈ వారమే రానుంది.
ఓటీటీలో సందడి చేయనున్న సినిమాల జాబితా చూస్తే ముందుగా నెట్‌ఫ్లిక్స్ లో రైడ్2 (హిందీ మూవీ) జూన్ 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. స్క్విడ్ గేమ్: ఫైనల్ సీజన్ (వెబ్‌సిరీస్) జూన్ 27 వ తేదీ నుంచి, ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (రియాల్టీ షో) జూన్ 28 వ తేదీ నుంచి , పింటు పింటు సుర్గా (మూవీ) ఇంగ్లీష్ జూన్ 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.ఇక అమెజాన్ ప్రైమ్ లో చూస్తే పంచాయత్ 4 (హిందీ సిరీస్) జూన్ 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. సన్ నెక్ట్స్ లో అజాదీ ( తమిళ సినిమా)- జూన్ 27 నుండి స్ట్రీమ్ కానుండగా, ఒక పథకం ప్రకారం ( తెలుగు మూవీ)- జూన్ 27 నుండి స్ట్రీమ్ కానుంది. ఇక బుక్ మై షోలో అల్ఫా ( ఇంగ్లీష్ చిత్రం)- జూన్ 24 నుండి స్ట్రీమ్ కానుంది. ద బ్రేకప్ క్బల్( డచ్ మూవీ)- జూన్ 24 నుండి, రక్త బీజ్ ( గుజరాతి సినిమా)- జూన్ 26 నుండి స్ట్రీమ్ కానుంది.
జియో హాట్‌స్టార్ లో స్మార్ట్ ఆఫ్ బ్యూటీ (వెబ్‌సిరీస్) జూన్ 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుండగా, తు దడ్కన్ మే దిల్ (హిందీ మూవీ) జూన్ 23 వ తేదీ నుంచి, ది గిల్డెడ్ ఏజ్ (వెబ్‌సిరీస్: సీజన్3) జూన్ 23 వ తేదీ నుంచి, ఐరన్ హార్ట్ (మూవీ) జూన్ 25 వ తేదీ నుంచి, ది బేర్ (వెబ్‌సిరీస్: సీజన్4) జూన్ 26 వ తేదీ నుంచి , మిస్టరీ (వెబ్‌సిరీస్) జూన్ 27 వ తేదీ నుంచి, ది బ్రూటలిస్ట్ (మూవీ) జూన్ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక జీ5 లో చూస్తే .. విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ (తెలుగు సిరీస్) జూన్ 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.బిబిషన్ (బెంగాలీ వెబ్‌సిరీస్) జూన్ 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆపిల్ ప్లస్ టీవీ లో స్మోక్ ( ఇంగ్లీష్ సిరీస్)- జూన్ 27 నుండి స్ట్రీమ్ కానుంది.