కిరణ్ లోవ, లక్ష్మి కిరణ్, హరీష్ బొంపల్లి, మంజీర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఓసీ’. కిరణ్, విష్ణు దర్శకులు. కౌండిన్య ప్రొడక్షన్స్ పతాకంపై విష్ణు శరణ్ బొంపల్లి నిర్మిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైంది. దర్శకులు మాట్లాడుతూ ‘ప్రతిభ ఉన్న వాళ్లు పల్లెటూరిలోనూ రాణిస్తారు అనే కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. మరో రెండు వారాల్లో రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుంది’ అన్నారు.