Rahul Sipligunj Wedding | తెలంగాణ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. గురువారం ఉదయం తన ప్రియురాలు హరిణ్యతో కలిసి ఏడడగులు వేశాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకి రాజకీయ ప్రముఖులతో పాటు సినీ, క్రీడా ప్రముఖులు హాజరై నుతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తెలంగాణ ఆల్బమ్స్‌తో పాటు టాలీవుడ్లో కాలేజ్ బుల్లోడా, ‘రంగా రంగా రంగస్థలానా’, ‘బొమ్మోలే ఉన్నదిరా పోరీ’ లాంటి పాటలతో గుర్తింపు సాధించిన రాహుల్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో పాడిన ‘నాటు నాటు’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక ఈ పాటకే ఆస్కార్ అవార్డు కూడా లభించింది.
నిన్న రాత్రి వైభవంగా జరిగిన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహం. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు. #RahulSipligunj #Hyderabad pic.twitter.com/XIuXi0JXbS
— Telugu Stride (@TeluguStride) November 27, 2025