క్రిస్టోఫర్ నోలన్ (CHRISTOPHER NOLAN).. సినమాలు అర్ధం చేసుకోవాలంటే సైన్స్ అర్థం చేసుకోవాలి. INTERSTELLAR, TENET, INCEPTIONలాంటి సినిమాలు అందుకు కొన్ని ఉదాహరణలు. 25 సంవత్సరాల తన సినీ ప్రస్థానంలో కేవలం 13 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించాడంటేనే అర్థం చేసుకోవచ్చు.
ఈ సారి తన జోనర్‌కు భిన్నంగా మరో సినిమాతో వస్తున్నారు. ఆ సినిమానే ఓపెన్‌హైమర్ (OPPENHEIMER). అయితే ఈ సినిమా నోలన్ గత సినిమాల మాదిరిగా కాకుండా అణుబాంబు పితామహుడిగా పేరున్న ‘జులీయస్ రాబర్ట్ ఓపెన్‌హైమర్’ జీవిత్ర చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదల అయింది. నాజీలకు వ్యతిరేఖంగా అణ్వాయుధాలను సృష్టించేందుకు అమెరికన్లు ఏం చేశారనేది సినిమా సారాంశంగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఓపెన్‌హైమర్ అమెరికా ప్రాజెక్టులో ఎలా భాగమయ్యారు, అణుబాంబును తయారు చేసేందుకు వాళ్లు పడిన ఇబ్బందులేంటి అనే విషయాలను ట్రైలర్లో గమనించవచ్చు. ప్రపంచాన్ని నాశనం చేసేందుకు ఆ బాంబును ప్రయోగించారా..లేదా తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఈ సినిమా జులై 21న రిలీజ్ కానుంది. కిల్లియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనీ జూ., ప్లోరెన్స్ ప్రధాన పాత్రధారులుగా నటించారు. క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమాను కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేయడం విశేషం.