యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. తుమ్మల ప్రసన్నకుమార్ నిర్మించారు. ఈ చిత్రాన్ని హారర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రేలంగి నరసింహారావు రూపొందించారు. ఈ నెల 18న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేలంగి నరసింహారావు మాట్లాడుతూ..‘ఇప్పటి వరకు ఇలాంటి హారర్ థ్రిల్లర్ సినిమా రాలేదు. మంచి కథ ఈ సినిమాకు కుదిరింది. విజయం అందుకుంటామనే నమ్మకం ఉంది’ అన్నారు. నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ…‘దర్శకుడిగా రేలంగి గారికి 76వ చిత్రమిది. హైదరాబాద్‌తో పాటు కాశ్మీర్‌లోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. ఫస్ట్ కాపీ చూసుకున్నాక చాలా సంతృప్తికరంగా అనిపించింది’ అన్నారు.