Adipurush | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్ (Adipurush). రామాయణం (Ramayanam) ఆధారంగా బాలీవుడ్ (Bollywood) దర్శకుడు ఓం రౌత్(Om Raut) ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెకకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల రామనవమి సందర్భంగా ఓ బ్యూటిఫుల్ పోస్టర్ని రిలీజ్ చేసిన మేకర్స్.. నేడు హనుమాన్ జయంతి (Hanuman Jayanti) సందర్భంగా హనుమంతుడి పోస్టర్ని రిలీజ్ చేశారు.
వెనుక రాముడు ఫేస్ ఉండి ముందు హనుమంతుడు ధ్యానం చేస్తున్నట్లు పోస్టర్‌ను తీర్చిదిద్దారు మేకర్స్. హనుమంతుడి పోస్టర్ని షేర్ చేస్తూ.. ‘రాముడికి భక్తుడు, రామ కథకి ప్రాణం, జై పవన పుత్ర హనుమాన్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ సినిమాలో హనుమంతుడిగా దేవ్దత్త నగే (Devdatta Nage) నటించారు.
ఈ మూవీని 2023 జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, సీతగా కృతిసనన్, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తుండగా.. హనుమంతుడి పాత్రలో దేవ్‌దత్తా నగే నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సాచెట్-పరంపర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ను ఇప్పటికే విడుదల చేయగా.. మిక్స్ డ్ రెస్పాన్ వచ్చింది.
Also Read..
Kuno National Park | కూనో నేషనల్ పార్క్ నుంచి పారిపోయిన మరో చీతా..!
Khushi Kapoor | ట్రెడిషనల్ డ్రెస్‌లో పరువాలు ఒలకబోస్తున్న ఖుషి కపూర్..
Hanuman Jayanti | హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు.. కొండగట్టుకు వేలాదిగా తరలివస్తున్న భక్తులు