‘ఇది ఒక స్క్రీన్‌ప్లే బేస్డ్ మూవీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఆడియన్‌ని సీట్ అంచున కూర్చోబెట్టేలా సినిమా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత ఇందులో విలన్ ఎవరో చెప్పగలిగితే పదివేల రూపాయలు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాం.’ అని దర్శక, నిర్మాత వినోద్‌కుమార్ విజయన్ తెలిపారు. గార్లపాటి రమేష్‌తో కలిసి స్వీయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. సాయిరామ్ శంకర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. శ్రీలక్ష్మి ఫిల్మ్స్ బాపిరాజు రెండు తెలుగురాష్ర్టాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్ మీడియాతో ముచ్చటించారు. ఇందులో సాయిరామ్‌శంకర్ పాత్రలో విభిన్నమై షేడ్స్ ఉంటాయని, శృతి సోధి, ఆషిమా నర్వాల్, సముద్రఖని పాత్రలు ఆకట్టుకుంటాయని, సెన్సార్‌వాళ్లు కూడా సినిమా చూసి అభినందించారని వినోద్‌కుమార్ విజయన్ చెప్పారు. మలయాళంలో తాను చాలా చిత్రాలు నిర్మించానని, తాను దర్శకత్వం వహించిన చిత్రాలకు జాతీయ అవార్డులు కూడా వచ్చాయని, ఫహాద్ ఫాజిల్, గోపీసుందర్ వంటి వారిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది తానేనని ఆయన తెలిపారు.