పవన్‌కల్యాణ్ ‘ఓజీ’ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. పియాంక అరుల్ మోహన్ ఇందులో కథానాయిక. వచ్చే నెల 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ వేగం పెంచారు. అందులో భాగంగా కథానాయిక ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. ఇందులో ఆమె కన్మణిగా కనిపించనున్నారు. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలన్నీ ‘ఓజీ’ని ఓ భారీ యాక్షన్ మూవీగా ఆవిష్కరించాయి.
తాజాగా విడుదలైన ప్రియాంక ఫస్ట్‌లుక్ మాత్రం అందుకు భిన్నంగా ‘ఓజీ’ని ఓ కలర్‌ఫుల్ ప్రేమకథగా ప్రజెంట్ చేస్తున్నది. సుజీత్ మార్క్ యాక్షన్ విస్పోటనంతోపాటు లోతైన భావోద్వేగాలు కూడా ఈ సినిమాలో ఉంటాయని ప్రియాంక లుక్ చెబుతున్నది.
మరోవైపు ఈ సినిమా నుంచి రెండో గీతాన్ని విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాశ్‌రాజ్, శ్రియారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవికె.చంద్రన్, మనోజ్ పరమహంస, సంగీతం: తమన్, నిర్మాత: డి.వి.వి.దానయ్య, నిర్మాణం: డి.వి.వి. ఎంటైర్టెన్మెంట్స్.