OG Movie Business | ప్రీ లుక్ పోస్టర్‌తో వేల కోట్ల అంచనాలు క్రియేట్ చేసిన ఘనత సుజీత్కే దక్కింది. పవన్ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా.. అభిమానులు మాత్రం కాస్త ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది ఓజీ సినిమాపైనే. అర్థం చేసుకోలేక ఫ్లాప్ చేశామే కానీ.. సాహో సినిమా రేంజ్ వేరన్నది ఎందరో అన్న మాటలు. అలాంటి సుజీత్ నుంచి ఐదేళ్ల తర్వాత సినిమా, అది కూడా పవన్ కళ్యాణ్‌తో అంటే అంచనాలు ఖచ్చితంగా తారా స్థాయిలోనే ఉంటాయి. సుజీత్ సైతం అభిమానుల అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నాడని ఇన్సైడ్ టాక్. పవన్ కెరీర్లోనే ది బెస్ట్ ఇంట్రోను ఈ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారట. ఫైట్స్ అయితే టాలీవుడ్లో నెవర్ బిఫోర్ అని టాక్.
ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త మాత్రం ఫ్యాన్స్‌నే కాదు అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. ఈ సినిమాకు ఓవర్సీస్లో మాములు డిమాండ్ లేదు. ఓజీ ఓవర్సీస్ హక్కులు దాదాపు రూ.18 కోట్ల రేటు పలుకుతున్నాయట. పవన్ లాస్ట్ మూవీ భీమ్లానాయక్‌ను డబుల్ మార్జిన్‌తో కొట్టేసింది. ఇప్పటివరకు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు. అయినా ఇలా రికార్డు స్థాయి బిజినెస్ జరుగుతుందంటే ఓజీపై క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీలైనంత వరకు ఈ ఏడాది చివర్లో.. తప్పితే మార్చి నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.