Rajinikanth | సూపర్ స్టార్ అనే పేరు తెరపై కనిపిస్తే చాలు ఈలలు గోలలతో థియేటర్లు దద్దరిల్లిపోతుంటాయి. ఆయన సినిమా విడుదలవుతుందంటే తమిళనాట పెద్ద పండగే. ఇక రజనీ స్క్రీన్ మీద కనబడితే అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తమిళ సినిమా గురించి దేశం నలుమూలల మాట్లాడుకునేలా చేసిన ఘనత ఆయనది. ఆయన ఫ్లాపు సినిమాలు సైతం కొందరి హీరోల బ్లాక్బస్టర్ సినిమాల రేంజ్లో కలెక్షన్లు సాధిస్తుంటాయి. రజనీకి తమిళనాట ఫ్యాన్స్ కాదు భక్తులుంటారు. ఆయన సినిమా రిలీజవుతుందంటే చాలా మంది హిట్టవ్వాలని పూజలు గట్రా చేపిస్తుంటారని ఇప్పటికీ మనం వింటూనే ఉంటాం. అంతలా ఆయన్ని అభిమానిస్తుంటారు.
ప్రస్తుతం రజనీ నటించిన జైలర్ సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఆగస్టు 11న విడుదల కాబోతున్న ఈ సినిమాపై వీర లెవల్లో అంచనాలున్నాయి. ఎన్నో ఏళ్లుగా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న రజనీకి ఈ సినిమా బంపర్ హిట్టవుతుందని అందరూ ధీమాగా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా విడుదల సందర్భంగా యూనో ఆక్వా కేర్ అనే కంపెనీ ఆగస్టు 10న హాలీడే ప్రకటించింది. అంతేకాదు అందులో పనిచేస్తున్న ఉద్యోగులందరికి ఉచితంగా మూవీ టిక్కెట్లు ఇవ్వనుంది. దీన్ని బట్టి చూస్తే రజనీ క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తుంది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, చెంగల్పట్టు, మట్టుతావని, అరపాళ్యం, అలగప్పన్ నగర్ బ్రాంచ్లకు సెలవు ప్రకటించబోతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
నెల్సన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా చేస్తుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు గట్రా వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేశాయి. పోటీగా తెలుగులో భోళాశంకర్ వస్తున్నా.. ఈ సినిమాకు పెద్దగా పోటీగా కనిపించడం లేదు. ఒక వేళ చిరు గట్టి పోటినిచ్చినా.. ఎలాగో ముందు రోజు రిలీజవుతుంది కాబట్టి ఓపెనింగ్స్తోనే సగం బిజినెస్ రికవరీ అయ్యే అవకాశం లేకపోలేదు. పైగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మాములు క్రేజ్ లేదు.