ఊరిని రక్షించే ఓదెల మల్లన్న
‘ఓ పల్లెటూరి కథను ఎక్సైయిటింగ్గా చెప్పడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఇది ఈజీ జోనర్ కాదు. ఇందులో భైరవి క్యారెక్టర్ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే సినిమా అవుతుంది’ అని చెప్పింది తమన్నా.
‘ఓ పల్లెటూరి కథను ఎక్సైయిటింగ్గా చెప్పడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఇది ఈజీ జోనర్ కాదు. ఇందులో భైరవి క్యారెక్టర్ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే సినిమా అవుతుంది’ అని చెప్పింది తమన్నా. ఆమె నాగసాధువుగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓదెల-2’.అశోక్‌తేజ దర్శకుడు. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం జరిగిన ప్రెస్మీట్లో రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మూవీ క్రియేటర్, ప్రముఖ దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ ‘ఓదెల సినిమా నాకు ఓ ఎమోషన్. నేను ఆ ఉర్లో పుట్టిపెరిగాను. ఎంతో ప్రేమతో, గౌరవంతో ఈ సినిమా తీశాను. ఓదెల గ్రామంలో పెద్ద కష్టం వస్తే ఊరి ఇలవేల్పు ఓదెల మల్లన్న నాగసాధువు పాత్ర ద్వారా ఎలా పరిష్కరించాడన్నదే చిత్ర కథాంశం. కథ, కంటెంట్, విజువల్స్ అద్భుతంగా ఉంటాయి.
భైరవి పాత్రలో తమన్నా అభినయం, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ప్రధానాకర్షణలుగా నిలుస్తాయి’ అన్నారు. కుంభమేళాలో రిలీజ్ చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని నిర్మాత డి.మధు తెలిపారు. హెబ్బాపటేల్, వశిష్ట ఎన్ సింహ, యువత, నాగ మహేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాణం : మధు క్రియేషన్స్, సంపత్‌నంది టీమ్ వర్క్స్, నిర్మాత: డి.మధు, క్రియేటర్: సంపత్‌నంది, దర్శకత్వం: అశోక్‌తేజ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

