బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Oct 04, 2020 , 12:53:17

'ఓట్స్‌ కారెట్‌ ఇడ్లీ' చేసిన సమంత

'ఓట్స్‌ కారెట్‌ ఇడ్లీ' చేసిన సమంత

క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రు త‌మ ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించుకోవాల‌నే స్ఫూర్తిని క‌లిగించేందుకు రామ్ చరణ్ సతీమణి, అపోలో సంస్థ వైస్ చైర్మన్ ఉపాసన కొణిదెల ‘యూ ఆర్ లైఫ్’ అనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ వెబ్‌సైట్‌కు అతిథి సంపాదకురాలిగా స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఉన్నారు. గ‌త వారం సమంత, ఉపాసనతో కలిసి ‘తక్కలి సదం’ వంటకాన్ని చేసి చూపించారు. ఆ వంటకం రెసిపీ వీడియోలో చూపించారు. 

తాజాగా ఓట్స్‌ కారెట్‌ ఇడ్లీ చేసింది స‌మంత‌. బ్రేక్ ఫాస్ట్ వంట‌కంగా దీనిని చేసుకోవ‌చ్చ‌న్న స‌మంత ఏఏ ప‌దార్ధాల‌ను ఉప‌యోగించాలి, ఎలా చేయాల‌నే దానిని వీడియో రూపంలో చూపించారు. స‌మంత వంట‌కాల‌కు ఆమె అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు. 'యుఆర్ లైఫ్' అనే వెబ్ సైట్  ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం, ముఖ్యంగా - ప్రకృతి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం వంటి కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమే అని ఉపాస‌న అంటుంది.  logo