స్వీయ దర్శకత్వంలో షెరాజ్ మెహదీ హీరోగా నటించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. స్కై ఈజ్ ది లిమిట్ స్టూడియోస్ పతాకంపై సురీందర్ కౌర్ నిర్మించారు. గతంలోనే ఈ సినిమా విడుదలైంది. తాజాగా ప్రేక్షకుల అభ్యర్థన మేరకు ఈ చిత్రాన్ని ఈ నెల 24న రీరిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఇటీవల మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మహిళా ప్రధాన చిత్రమిదని, చక్కటి సందేశంతో ఆకట్టుకుంటుందని, సమాజంలో అమాయక మహిళలు ఎలా మోసపోతున్నారనే అంశాన్ని చూపించడంతో పాటు మోసాలకు పాల్పడేవారికి శిక్ష తప్పదనే సందేశాన్ని కూడా అందించామని మేకర్స్ తెలిపారు. విహాన్షి హెగాడే, కృతివర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం, దర్శకత్వం: షెరాజ్ మెహదీ.