‘నీకు నా గురించి తెలియదు. ఇప్పుడు తెలుసుకుంటావ్..’, ‘నా కళ్లు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతున్నాయి కబీర్’ అనే పవర్ఫుల్ సంభాషణలతో గత నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ‘వార్-2’ టీజర్ ప్రేక్షకుల్లో అంచనాల్ని అమాంతం పెంచింది. ఎన్టీఆర్ పాత్రను ప్రజెంట్ చేసిన విధానం అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నది.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ లుక్స్, కాస్ట్యూమ్స్ గురించి చిత్ర కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఎన్టీఆర్ సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తే అందరిలో ఏదో తెలియని ఎనర్జీ వచ్చిన భావన కలుగుతుందని, ఆయన ఆకర్షణ శక్తి అలాంటిదని ప్రశంసించారు. ఎన్టీఆర్ పాత్రలో ఎన్నో లేయర్స్ ఉంటాయని, వాటికి తగినట్లుగా డిఫరెంట్ లుక్స్, కాస్ట్యూమ్స్ డిజైన్ చేశామని, ఈ సినిమాలో ఆయన ఓ లక్ష్యంతో పనిచేసే మానవ యంత్రంలా కనిపిస్తారని అనైతా ష్రాప్ వివరించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ‘రా’ విభాగం గూఢచారి పాత్రలో కనిపించనున్నారు.