NTR- Ram Charan | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. వీరిద్దరు టాలీవుడ్ టాప్ హీరోలు కాగా, పాన్ ఇండియా స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. మూవీ ప్రమోషన్ సమయంలో వీరిద్దరు తమకి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ బాండింగ్ చూసి అభిమానులు తెగ మురిసిపోయారు. అయితే చాలా రోజుల తర్వాత మళ్లీ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించి సందడి చేశారు. ఆర్ఆర్ఆర్ లైవ్ మ్యూజిక్ ఈవెంట్‌ను కీరవాణి లండన్‌లో నిర్వహించగా,ఆర్ఆర్ఆర్ టీం రాయల్ ఆల్ బర్ట్ హాల్లో మెరిసింది.
గతంలో అక్కడ బాహుబలి లైవ్ మ్యూజిక్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి కలిసి సందడి చేశారు. రాంచరణ్, ఎన్టీఆర్ రాయల్ ఆల్బర్ట్ హాల్ లోకి స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చారు. ఒకే వేదికపై RRR త్రయం కనిపించడంతో ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆత్మీయ ఆలింగనం చేసుకోవడంతో పాటు తారక్‌కి చరణ్ ముద్దు పెట్టడం అక్కడి వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. హీరోలు ఇంత బాగా కలిసి ఉంటారా అంటూ ఫ్యాన్స్ మైమరిచిపోతున్నారు. ప్రస్తుతం వారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది. నాటు నాటు సాంగ్ కి ఏకంగా ఆస్కార్ అవార్డు కొల్లగొట్టింది. హాలీవుడ్ వాళ్లు సైతం తెలుగు సినిమా వైపు చూసేలా ఆర్ఆర్ఆర్ చిత్రం సంచలనాలు సృష్టించింది. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ బాండింగ్‌కు సంబంధించిన వీడియోలు బాగానే వైరల్ అవుతున్నాయి. రాయల్ ఆల్ బర్ట్ హాల్లో రామ్ చరణ్ ప్రసంగిస్తూ.. మే 20న ఎన్టీఆర్ తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోనున్న నేపథ్యంలో అడ్వాన్స్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ఇక ఎన్టీఆర్ కూడా రాంచరణ్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేశారు. రామ్ చరణ్ భోజనం తో పాటు తన డైట్ లో వెన్నపూస కూడా తింటారని తెలిపారు.
Idhi ra Charan ante….🥹🧡
Charan midha Charan movies midha entha negative chepinchina big stage midha wishes cheppadu 🫡🫠
Gold @AlwaysRamCharan 😭🧡pic.twitter.com/GARJ02J4Gv
— ᴱᴸᴱⱽᴱᴺ REDDY (@11_Red_E) May 11, 2025