NTR-NEEL | యంగ్ టైగర్ ఎన్టీఆర్ – స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్-ఇండియన్ సినిమా (వర్కింగ్ టైటిల్: డ్రాగన్) పై తాజాగా క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో దూసుకుపోతోంది.తాజాగా ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో విజయవంతంగా పూర్తయింది. ఈ షెడ్యూల్లో ఎక్కువగా నైట్ ఎఫెక్ట్‌తో నైట్ షూటింగ్ నిర్వహించారట. ఈ విషయాన్ని సినిమాటోగ్రఫీ విభాగంలో పని చేస్తున్న ప్రజ్వల్ గౌడ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేయడంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. తదుపరి షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ప్రశాంత్ నీల్ అంటేనే భారీ యాక్షన్, డార్క్ టోన్, పవర్ఫుల్ ఎలివేషన్లు గుర్తుకు వస్తాయి. అదే ఫార్ములాను ఈసారి ఎన్టీఆర్ స్థాయికి మించి చూపించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా ప్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతుందట. ఇందులో యాక్షన్ సీక్వెన్సులు అత్యంత ఇంటెన్స్‌గా ఉండబోతున్నాయట. ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ యాక్షన్ రోల్స్‌లో ఇది ఒకటిగా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ప్రశాంత్ నీల్ ఎక్కడా రాజీ పడలేదట. కథను ఫైనల్ చేయడానికి చాలా సమయం తీసుకుని, ప్రతి సన్నివేశం ప్రేక్షకులను షాక్ ఇచ్చేలా డిజైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన అన్ని సినిమాల్లోకెల్లా ఇదే బెస్ట్ మూవీ అవుతుందన్న అంచనాలు బలంగా ఉన్నాయి.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్ హౌసెస్‌గా గుర్తింపు పొందిన మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో, పాన్-ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రవి బస్రూర్ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఇందులో కథానాయికగా రుక్మిణి వసంత్, కీలక పాత్రలో అనిల్ కపూర్ కనిపించినున్నారు. ముఖ్యంగా రవి బస్రూర్ అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో లెవల్ తీసుకెళ్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. ఇప్పటికే బిజినెస్ వర్గాల్లోనూ ఈ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. జూన్ 25, 2026న సినిమాని విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారు.