NTR-NEEL | వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న ఎన్టీఆర్.. ‘డ్రాగన్’ మూవీ క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
NTR-NEEL | జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత తన కెరీర్‌ను పూర్తిగా పాన్ ఇండియా స్థాయిలో విస్తరిస్తూ వెళుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ తర్వాత, కొరటాల శివతో చేసిన “దేవర పార్ట్ 1” తో తారక్ మార్కెట్ మరింత పెరిగింది. అయితే ఆ తర్వాత బాలీవుడ్లో చేసిన “వార్ 2” మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశ పరిచింది.
NTR-NEEL | జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత తన కెరీర్‌ను పూర్తిగా పాన్ ఇండియా స్థాయిలో విస్తరిస్తూ వెళుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ తర్వాత, కొరటాల శివతో చేసిన “దేవర పార్ట్ 1” తో తారక్ మార్కెట్ మరింత పెరిగింది. అయితే ఆ తర్వాత బాలీవుడ్లో చేసిన “వార్ 2” మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశ పరిచింది. ఈ సినిమా ఫలితం తారక్ బాలీవుడ్ ప్రణాళికలపై కొంత ప్రభావం చూపినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. “టెంపర్” తర్వాత వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఎన్టీఆర్‌కు ఇది స్పీడ్ బ్రేకర్లా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు “డ్రాగన్” అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం.
మొదట ప్లాన్ చేసిన కథకు బదులుగా కొత్త కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ముందుగా ఈ ఏడాది విడుదల చేయాలని భావించినా, షూటింగ్ ఆలస్యమవడంతో రిలీజ్‌ను వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విడుదల చేసిన పోస్టర్లో కొండపై నిలబడి ఉన్న ఎన్టీఆర్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. మరోవైపు సినిమా తాలూకా ఫస్ట్ గ్లింప్స్ పై కూడా క్లారిటీ ఇచ్చేసారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా గ్లింప్స్‌ని విడుదల చేస్తున్నట్టు ఖరారు చేశారు. సో ఇది మాత్రం అభిమానులకి ఒక బ్లాస్టింగ్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు.
ఇక ఈ సినిమా తర్వాత “దేవర పార్ట్ 2” కూడా లైన్లో ఉంది. అదే సమయంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో కూడా ఎన్టీఆర్ ఓ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇవే కాకుండా ఎన్టీఆర్ మరో భారీ ప్రాజెక్ట్‌ను కూడా ఓకే చేసినట్టు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ పౌరాణిక చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో సుబ్రహ్మణ్య స్వామి చరిత్రను ప్రధానంగా తీసుకుని కథను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ సుబ్రహ్మణ్య స్వామి పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి “గాడ్ ఆఫ్ వార్” అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
మొత్తానికి వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఎన్టీఆర్, మరోవైపు పౌరాణిక కథతో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఆయన పుట్టినరోజు సందర్భంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- glimpse
- NTR
- prashant neel
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

