ఒకటే ఆయుధం, ఒకటే ఆశయం.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ డివైన్ మూవీ అనౌన్స్మెంట్
ఎన్టీఆర్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గత ఏడాదిగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబో మూవీపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడింది.
ఎన్టీఆర్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గత ఏడాదిగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబో మూవీపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడింది. భారతీయ పురాణాల్లో విజయానికి, యుద్ధానికి ప్రతీకలా భావించే ‘గాడ్ ఆఫ్ వార్’ కార్తికేయుడి ఇతివృత్తం ప్రధానంగా కాల్పనిక అంశాలతో ఈ సినిమా రాబోతున్నదని ప్రచారం జరిగింది. తాజాగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్లో త్రిశూలం, కార్తికేయుడి ఆయుధమైన శూలం (శక్తివేల్) కనిపిస్తుండటం విశేషం. భారతీయ పురాణాల స్ఫూర్తితో దైవిక అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నామని, లోతైన భావోద్వేగాలు, యుద్ధ ఘట్టాలతో ఈ సినిమా ప్రేక్షకులకు అపూర్వమైన అనుభూతినందిస్తుందని మేకర్స్ తెలిపారు.
‘ఒకటే ఆయుధం, ఒ కటే ఆశయం..ఒక దైవిక కార్యం కోసం..’ అంటూ పోస్టర్‌పై రాసున్న క్యాప్షన్ చిత్ర కథను ప్రతిబింబిస్తున్నది. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కలయికలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా సినిమాపై అందరిలో ఆసక్తినెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ ప్రారంభ వివరాలను త్వరలో తెలియజేస్తామని మేకర్స్ పేర్కొన్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్నందించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

