Tollywood | వంటలకు డిమాండ్.. తిండి చుట్టూ అల్లుకుంటున్న సినిమా కథలు..
Tollywood | తినేవాడికి బోర్ కొట్టదు.. వండే వాడికి అస్సలే బోర్ కొట్టదు.. రిటైర్మెంట్ ఉండదు అంటూ చిరునవ్వుతో సినిమాలో త్రివిక్రమ్ ఓ డైలాగ్ రాశాడు కదా..? ఇప్పుడు దాన్నే ఫాలో అయిపోతున్నారు మన దర్శకులు. చాలామంది ఈ మధ్యకాలంలో వంటల చుట్టూ కథలు అల్లుకుంటున్నారు.
Tollywood | తినేవాడికి బోర్ కొట్టదు.. వండే వాడికి అస్సలే బోర్ కొట్టదు.. రిటైర్మెంట్ ఉండదు అంటూ చిరునవ్వుతో సినిమాలో త్రివిక్రమ్ ఓ డైలాగ్ రాశాడు కదా..? ఇప్పుడు దాన్నే ఫాలో అయిపోతున్నారు మన దర్శకులు. చాలామంది ఈ మధ్యకాలంలో వంటల చుట్టూ కథలు అల్లుకుంటున్నారు. కుకింగ్ నేపథ్యంలోనే ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు చాలా మంది ఈ వంటల బ్యాక్‌డ్రాప్ ఉన్న సినిమాలు చేస్తున్నారు.. మరీ ముఖ్యంగా ఫుడ్ బ్యాక్‌డ్రాప్ ఉన్న కథలకు డిమాండ్ కూడా బాగానే ఉందిప్పుడు. తాజాగా నయనతార తన 75వ సినిమా కోసం ఈ ఫుడ్ నేపథ్యంలో సాగే కథనే ఎంచుకుంది.
అన్నపూర్ణ అనే సినిమాతో వస్తుంది నయన్. నీలేష్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రేపు ( డిసెంబర్ 1న ) విడుదల కానుంది. దీనిపై తమిళంలో అంచనాలు బాగానే ఉన్నాయి. తెలుగులోనూ సినిమా విడుదలవుతుంది. అయితే ఇక్కడ యానిమల్ ఉండటంతో నయన్ సినిమా వస్తున్నట్లు చాలా మందికి ఐడియా లేదు. ఈ సినిమా టైటిల్లోనే అన్నపూర్ణ ఉంది కాబట్టి ఫుడ్ నేఫథ్యం అని అర్థమైపోతుంది. మరోవైపు ఈ మధ్యే అనుష్క నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలోనూ ఇదే నేపథ్యం ఉంటుంది. ఇందులో చెఫ్‌గా నటించింది జేజమ్మ. మహేశ్ బాబు తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే కీర్తి సురేశ్ సైతం ఆ మధ్య మిస్ ఇండియా అనే సినిమా చేసింది.
అందులోనూ వంటలే ప్రధానమైన నేపథ్యం. ఛాయ్ బ్యాక్ డ్రాప్లోనే సినిమా అంతా సాగుతుంది. ఫారెన్‌లో ఓ ఛాయ్ కంపెనీ ఓపెన్ చేయాలనేది హీరోయిన్ డ్రీమ్. ఇక నాగ చైతన్య సైతం వంటల మీద బాగా ఆసక్తి చూపిస్తుంటాడు. రియల్ లైఫ్‌లోనూ ఈయన మంచి చెఫ్. సినిమాలోనూ ఇదే కంటిన్యూ చేస్తున్నాడీయన. ఆ మధ్య ప్రేమమ్ సినిమాలో చెఫ్‌గానే నటించాడు చైతూ. ఒక్కటి రెండు కాదు.. ఈ మధ్య కాలంలో ఫుడ్ ఛానెల్స్‌కు ఎలాగైతే డిమాండ్ బాగా పెరిగిపోయిందో.. అలాగే ఫుడ్ బేస్డ్ సినిమాలకు కూడా క్రేజ్ పెరిగిపోయింది. అందుకే దర్శకులందరి చూపు అటు వైపు వెళ్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

