టెంపర్, బాహుబలి.. ది బిగినింగ్, కిక్ 2, లోఫర్, ఊపిరి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసింది కెనడియన్ సుందరి నోరా ఫతేహి (Nora Fatehi). ఈ డ్యాన్సింగ్ క్వీన్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఒక్క పోస్ట్ పెట్టిందంటే చాలు.. నెటిజన్లకు నిద్రపట్టడం కష్టమే. ఇపుడు అలాంటి వీడియోనే ఒకటి షేర్ చేసింది నోరా.
ఇంతకీ స్పెషల్ ఏంటీ అనుకుంటున్నారా..? ఇవాళ నోరా ఫతేహి పుట్టినరోజు. నేటితో 31వ పడిలోకి అడుగుపెట్టింది. మరి ఈ ప్రత్యేకమైన రోజు నోరా ఫతేహి ఎక్కడికెళ్లిందో తెలుసా..? ఈ భామ అందమైన అరబ్ దేశం దుబాయ్‌కి వెళ్లింది. అక్కడి బీచ్‌లో బ్యాక్ లెస్ అందాలతో హొయలుపోతూ షికారు చేసింది. నోరా తన పుట్టినరోజును దుబాయ్‌లో జరుపుకుంటోందని తెలియజేస్తూ.. కనెక్ట్ ఎఫ్ఎం కెనడా ప్రతినిథి ఫరిదూన్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ భామ గతేడాది థ్యాంక్ గాడ్, యాన్ యాక్షన్ హీరో చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసింది. నోరా ఫతేహి ప్రస్తుతం 100% సినిమాలో నటిస్తోంది.
బీచ్‌లో నోరా ఫతేహి షికారు ..
.#NoraFatehi celebrates her birthday in Dubai and shares this cool video pic.twitter.com/BcMtwPtFQx
— Faridoon Shahryar (@iFaridoon) February 6, 2023