Nora Fatehi | బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఇటీవల ఓ ప్రమాదం నుంచి బయటపడింది. నటుడు విద్యుత్, నోరా జంటగా నటించిన ‘క్రాక్’ సినిమా షూటింగ్లో ఈ సంఘటన జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. ఓ యాక్షన్ సన్నివేశంలో రోప్ వల్ల ఆమెకు గాయాలయ్యాయి. ‘అప్పుడేం జరిగిందో నాకు అర్థం కాలేదు. రోప్ గట్టిగా చుట్టుకుంది. బ్యాలెన్స్ కోల్పోయి నేను వెనక్కి పడిపోయాను.
రోలర్ బ్లేడ్స్ ముందుకు కదలడం వల్ల గాయం పెద్దదే అయింది. ఆ క్షణం ఏమైపోతుందో అని భయపడ్డా’ అని ఆనాటి సంగతిని పంచుకుంది నోరా. ‘ప్రమాదం తర్వాత షూటింగ్ స్పాట్లో గంభీరంగా ఉండటానికి ప్రయత్నించా. కాసేపటికి చిన్నపిల్లలా భోరున ఏడ్చేశా’ అని గుర్తు చేసుకుంది. ఆదిత్య దత్ దర్శకత్వంలోని ‘క్రాక్’ ఈనెల 23న విడుదల నుంది.