Nora Fatehi | చూడచక్కని రూపంతో ఆకట్టుకునే అందాల ముద్దుగుమ్మలో నోరా ఫతేహి కూడా తప్పక ఉంటుంది. స్టేజ్ పై ఆమె డాన్స్ చేస్తే అలా చూస్తూ ఉండిపోవాల్సిందే. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. నోరా ఫతేహికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆమె స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు . ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రంలో తన డ్యాన్స్‌తో అదరగొట్టి ఎంతో మంది మనసులు గెలుచుకుంది. అయితే నోరా ఇండస్ట్రీలోకి రాక ముందు చాలా సవాళ్ళను ఎదుర్కొంది. స్టూడియోల చుట్టూ తిరగడంతో పాటు చాలా ఆడిషన్స్ కూడా ఇచ్చింది. కెనడా నుంచి చేతిలో రూ. 5వేలతో ఇండియాలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగిందట.
కడుపు నింపుకోవడానికి ఒక్క గుడ్డు, ఒక్క బ్రేడ్ మాత్రమే తిన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఇప్పుడు మాత్రం నోరా ఫతేహి రేంజ్ వేరు. 5 నిమిషాల సాంగ్ కోసం రూ. రెండు కోట్లకు పైగా వసూలు చేసే ఈ ముద్దుగుమ్మ రూ. 50కోట్లకు పైనే ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తుంది. నోరా ఫతేహి తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఏడుస్తూ కనిపించడం అభిమానులను కలవరపరిచింది. నోరా ఫతేహి కన్నీళ్లతో ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే సమయంలో ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా, ఆమె బాడీగార్డ్ ఆ యువకుడిని పక్కకు తోసేశాడు.
నోరా ఏడవడానికి కారణం ఏంటనే దానిపై క్లారిటీ లేదు. అయితే ఈ ఘటనకు కొద్ది గంటల ముందే నోరా తన సోషల్ మీడియాలో అరబిక్ భాషలో ఓ భావోద్వేగపు పోస్టు పెట్టింది. దాని ఆధారంగా ఆమె కుటుంబంలో ఏదైనా విషాదం జరిగి ఉండొచ్చని, దగ్గరి బంధువు మరణించి ఉంటారేమో అని నెటిజన్లు ఊహిస్తున్నారు. కాగా, గత ఏడాది క్రాక్, మడ్ గావ్ ఎక్స్‌ప్రెస్, మట్కా వంటి సినిమాల్లో కనిపించిన నోరా, ఈ ఏడాది హ్యాపీ, హౌస్‌ఫుల్ 5 చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా ది రాయల్స్ అనే వెబ్‌సిరీస్‌లో ముఖ్య పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ఆమె చేతిలో హరిహర వీరమల్లు, కాంచన్ 4, మరియు కన్నడ చిత్రం కేడీ: ది డెవిల్ ఉన్నాయి. నోరా ఫతేహికి దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.