Madgaon express | బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నటిగా, డ్యాన్సర్‌గా సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది ఈ కెనడియన్ సుందరి. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ.. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఈ భామకు సోషల్ మీడియాలో కోట్లాదిమంది ఫ్యాన్ ఉన్నారన్న విషయం తెలిసిందే. ఈ భామకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ వచ్చిందంటే చాలు నెటిజన్లకు నిద్రపట్టడం కష్టమే. అయితే తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గోన్న నోరా మెట్రోలో డ్యాన్స్ చేసింది.
బాలీవుడ్ నటులు ప్రతీక్ గాంధీ, దివ్యేండు శర్మ, నోరా ఫతేహి, అవినాష్ తివారీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ముంబై మెట్రోలో వెళ్లిన నోరా ఫతేహి అక్కడి ప్రయాణికులతో కలిసి మూవీలో పాటకు డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.