Jailer Vs Jailer | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం జైలర్ (Jailer). కామెడీ డ్రామా నేపథ్యంలో నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఆగస్టు 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా మరోవైపు సేమ్ టైటిల్‌తో మలయాళంలో ధ్యాన్ శ్రీనివాసన్ (Dhyan Sreenivasan) హీరోగా వస్తున్న జైలర్ సినిమా ఇదే రోజు విడుదలవుతూ.. రజినీకాంత్ జైలర్‌తో పోటీపడనుందని ఇప్పటికే ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
జైలర్ టైటిల్ వివాదం విషయంలో మలయాళ డైరెక్టర్ సక్కిల్ మదాథిల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు నుంచి క్లియరెన్స్ రావడంతో ఆగస్టు 10న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ సినిమాతో పోటీ పడకుండా సేఫ్ జోన్లో ఉండేలా ధ్యాన్ శ్రీనివాసన్ టీం జైలర్ విడుదలను వాయిదా వేసింది. తాజా అప్డేట్ ప్రకారం జైలర్ ఆగస్టు 18న విడుదల కానుంది.
మొత్తానికి ఇలా ఒకే టైటిల్‌తో రెండు వేర్వేరు సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుండటంతో పోటీ ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకులకు.. తాజా నిర్ణయంతో ఆ ఛాన్స్ లేకుండా పోయిందనే చెప్పాలి.
రజినీకాంత్ జైలర్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. రజినీకాంత్ దీంతోపాటు జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో తలైవా 170 (Thalaivar 170)కూడా ప్రకటించాడని తెలిసిందే. లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
రజినీకాంత్ జైలర్ గ్లింప్స్ వీడియో..
జైలర్ Official Show Case..
తమన్నా గ్లామరస్ లుక్..
.@tamannaahspeaks from the sets of #Jailer
@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/sKxGbQcfXL
— Sun Pictures (@sunpictures) January 19, 2023
జైలర్ సెట్స్ లో సునిల్
.@mee_sunil from the sets of #Jailer @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/JJBfQw91QH
— Sun Pictures (@sunpictures) January 17, 2023
జైలర్ సెట్స్ లో మోహన్ లాల్..
Lalettan @mohanlal from the sets of #Jailer 🤩@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/wifqNLPyKf
— Sun Pictures (@sunpictures) January 8, 2023