Nivetha Thomas | మలయాళ బ్యూటీ నివేతా థామస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జెంటిల్మెన్, నిన్నుకోరి, బ్రోచేవారేవురా, పవన్ కళ్యాన్ బ్రో వంటి చిత్రాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అప్పుడెప్పుడో శాకిని డాకిని అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ఆ తర్వాత ఏ సినిమాను ఒప్పుకోలేదు. అయితే నివేతా పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నివేతా థామస్ కొన్ని రోజులుగా సోషల్ మీడియా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు ప్రతిది పోస్ట్ చేసే ఈ భామ కొన్ని రోజులు అసలే కనిపించకుండా పోయింది. ఇదిలావుంటే తాజాగా ఎక్స్ వేదికగా ఒక స్పెషల్ పోస్ట్ పెట్టింది.
చాలా కాలం గడిచింది… కానీ.. చివరిగా అంటూ లవ్ ఎమోజీని జత చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన కొందరు నెటిజన్లు నివేతా పెళ్లి చేసుకోబోతుంది అంటూ కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు మూవీ అప్డేట్ అయ్యింటుందని కామెంట్లు పెడుతున్నారు. కాగా దీనిపై నివేతా క్లారిటీ ఇవ్వవలసి ఉంది.
It’s been a while….. but.
Finally!
❤️
— Nivetha Thomas (@i_nivethathomas) June 24, 2024