Home
Cinema
Nivetha Thomas Has Earned The Distinction Of Being The First Leading Lady To Receive The Best Actress Award From The Telangana Govt
అమ్మాయి షూటింగ్‌కి బయలుదేరింది
‘35 చిన్న కథకాదు’ సినిమాకు గాను, 2024వ సంవత్సరానికి ఉత్తమనటిగా గద్దర్ అవార్డు అందుకుని, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమనటిగా అవార్డు అందుకున్న తొలి కథానాయికగా క్రెడిట్ కొట్టేసింది మలయాళ భామ నివేద థామస్.
ఆ సినిమా తర్వాత రెండేండ్లపాటు నటనకు దూరంగా ఉన్న నివేదా.. మళ్లీ కెమెరా ముందుకు రానున్నది. ‘శ్రీమతి’ అనే ఫ్యామిలీ డ్రామాలో ఆమె నటించనున్నారు. విశ్వక్ ఖండేరావ్ దర్శకుడు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈచిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నది. ఈ కొత్త ప్రయాణం గురించి నివేదా థామస్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘అంతా సిద్ధమైంది.. ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాను.
ఇది నాకు తెలిసిన ప్రపంచమే అయినప్పటికీ ఎంతో అవసరమైనదీ.. ప్రత్యేకమైనది. కొత్త సినిమా సెట్లో మొదటి రోజు దగ్గర పడుతుండటంతో నాలో ఓ రకమైన ఆందోళనగా భయంగా ఉంది. ఇది ఆతృత కాదు. పని మొదలుపెట్టాలనే ఉత్సాహం. ఓ అమ్మాయి సినిమా చిత్రీకరణ కోసం బయలుదేరింది’ అని నివేదా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

