Paruvu Web Series | టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ కొన్ని రోజుల క్రితం పోలీసులతో గొడవపడినట్లు వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీని వెనక గల మిస్టరీ బయట పడింది. ఇదంతా కూడా తన కొత్త సినిమా కోసం చేసిన ప్రమోషన్ స్టంట్ అని తెలిసిపోయింది. నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) తాజాగా నటిస్తున్న వెబ్ సిరీస్ ‘పరువు’ (Paruvu). ఈ మూవీ ప్రమోషన్స్ కోసమే నివేదా ఇలా ప్రవర్తించినట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో పాటు ప్రీమియర్ తేదీని అనౌన్స్ చేశారు మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఇక పరువు ట్రైలర్‌ను గమనిస్తే.. నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య ప్రేమికులు. కులం వేరు కారణంగా ఇంట్లో ఒప్పుకోకపోవడంతో తెలీకుండా పారిపోతారు. ఈ క్రమంలోనే వారికి ఎదురైన సంఘటనలు ఏంటి అనేది సినిమా స్టోరీ. ఇక క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సిరీస్‌లో నాగబాబు కీలక పాత్ర పోషిస్తుండగా.. గోల్డెన్ బాక్స్ ఎంటర్టైనమెంట్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల నిర్మిస్తుంది. ఈ సిరీస్‌కు సిద్దార్థ్ – రాజశేఖర్ సంయక్తంగా దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.