నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. కృతిశెట్టి, కేథరీన్ ట్రెసా నాయికలుగా నటిస్తున్నారు. రాజకీయ నేపథ్యమున్న మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నది. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఎం.ఎస్ రాజశేఖర్‌రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించారు. ఆగస్టు 12న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
ముందుగా ఈ సినిమాను జూలై 8న విడుదల చేయాలని అనుకున్నా.. నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఆలస్యం వల్ల కొత్త తేదీకి వాయిదా పడింది. విడుదల తేదీ ప్రకటన సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పాటల చిత్రీకరణ ఇటలీ, ఆస్ట్రియాల్లో జరుగుతున్నది. ఈ చిత్రానికి సంగీతం : మహతి స్వరసాగర్, సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు.