నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న హీస్ట్ కామెడీ చిత్రం ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో పెద్దల సంపదను దోచి పేదలకు పంచే రాబిన్‌హుడ్‌గా నితిన్ కనిపించనున్నారు. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘వేర్ ఎవర్ యు గో..’ అనే రెండో గీతాన్ని విడుదల చేశారు. వివిధ బ్రాండ్ల క్యాప్షన్ల ద్వారా హీరో తన ప్రేమను వ్యక్తం చేసే కాన్సెప్ట్‌తో ఈ పాటను డిజైన్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఈ పాటను కృష్ణకాంత్ రచించారు. ైస్టెలిష్ డ్యాన్స్ మూమెంట్స్‌తో నితిన్, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ ఈ పాటలో ప్రధానాకర్షణగా నిలిచింది. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. వినోదప్రధానంగా సాగే యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ఇదని మేకర్స్ తెలిపారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: వెంకీ కుడుముల.